నల్లగొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్‌పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్లితో కలిసి స్కూల్‌కు వచ్చింది. అయితే తల్లి ముందే ప్రిన్సిపల్ ఆమెను తిట్టారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన సిబ్బంది బాధితురాలిని ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాలలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఇంటర్ విద్యార్థిని ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో శుక్రవారం చోటుచేసుకున్నది. కొండాపూర్ గ్రామానికి చెందిన వెనంకి రవి, జ్యోతి దంపతులకు కూతురు సహస్ర (15), కుమారుడు ఉన్నారు. 2017లో జ్యోతి ఆత్మహత్య చేసుకుం ది. కొంతకాలానికి రవి మరో మహిళను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి తండ్రి, పినతల్లితో కలిసి సహస్ర ఉండేది. సహస్రకు ఇటీవల చెవి నొప్పి రావడంతో ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సహస్ర మృతిపై అ నుమానం ఉందంటూ ఆమె అమ్మమ్మ సుగుణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
