Digital Gold: ఈ రోజుల్లో పసిడి పరుగులు సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ల మించిన వేగంతో దూసుకుపోతున్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు బంగారంలో పెట్టుబడులు అంటే కేవలం ఆభరణాలు, నాణేలు, కడ్డీలు మొదలైన వాటి రూపంలోనే కొనడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అన్ని రంగాలను సాంకేతికత ప్రభావితం చేస్తున్న సమయం ఇది. దీంతో ఈ సాంకేతికత అనేది బంగారం పెట్టుబడి విషయంలోకి కూడా ప్రవేశింది. ఈ రోజుల్లో బంగారాన్ని కేవలం భౌతిక రూపంలోనే కాకుండా, ఎలక్ట్రానిక్ పెట్టుబడి రూపాల్లో కూడా కొనుగోలు చేసే వెసులుబాటు ఉందనే విషయంపై ఎంత మందికి అవగాహన ఉంది. మీకు తెలుసా ఎన్ని రకాలుగా బంగారంలో సాంకేతికత ఆధారంగా పెట్టుబడి పెట్టవచ్చో..
READ ALSO: Florida Incident: ఇదేందయ్యా ఇది.. ఇది నేను సూడలే.. 273 కిలోలు ఉన్న క్రేన్ తో ఆస్పత్రికి…
ప్రజలు డిజిటల్ బంగారంలో లక్షల కోట్ల రూపాయలను ఒక్క గ్రాము కూడా భౌతిక రూపంలో ఉంచుకోకుండానే పెట్టుబడి పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ డిజిటల్ బంగారం పెట్టుబడిలో కూడా అసలైన బంగారానికి లభించే అన్ని ప్రయోజనాలను వారు పొందుతారు. ఎవరైతే డిజిటల్ బంగారంలో పెట్టుబడులు పెడుతారో.. వాళ్లకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వాటిని విక్రయించుకోవచ్చని చెబుతున్నారు. ఆభరణాలు కొనకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 5 ప్రత్యామ్నాయ మార్గాలు..
1. డిజిటల్ బంగారం
డిజిటల్ బంగారం అనేది అధిక స్వచ్ఛత గల బంగారంతో సమానం. భౌతిక బంగారంలా, వీటికి ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు. డిజిటల్ బంగారం కొనుగోలుదారులు దానిని డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ రకమైన బంగారం అధిక లిక్విడిటీని అందిస్తుంది. దీనిని 24/7 కొనుగోలు చేయవచ్చు, అలాగే విక్రయించవచ్చు. పెట్టుబడిదారులు డిజిటల్ బంగారంలో కేవలం రూ.1 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ డిజిటల్ బంగారం పెట్టుబడిలో పెట్టుబడిదారులకు పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (SIP)ను కూడా అందిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి మీరు తనిష్క్, MMTC-PAMP, PC జ్యువెలర్ వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బంగారాన్ని భౌతిక బంగారంగా మార్చుకునే అవకాశాన్ని కూడా పలు కంపెనీలు అందిస్తున్నారు.
2. గోల్డ్ ఇటిఎఫ్‌లు
గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) స్వచ్ఛమైన భౌతిక బంగారంలో పెట్టుబడి పెడతాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం రాబడి ప్రయోజనాన్ని పొందుతారు. ఇవి భౌతిక రూపంలో పసిడిని కలిగి ఉండవు. ఈ ETFలను ఇతర స్టాక్‌ల మాదిరిగానే షేర్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. బంగారు ETFలను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారుకు డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. ఒకసారి కొనుగోలు చేసిన ఈటీఎఫ్‌లను అమ్మాలనుకుంటే, మార్కెట్ సమయాల్లో మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. బంగారు ETFలు దీర్ఘకాలికంలో పెద్ద మొత్తంలో రాబడిని అందిస్తాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారుడికి వచ్చే లభం ఎంత అనేది బంగారం ధర పెరుగుదలపై ఆధారపడి ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. భారతదేశంలోని పురాతన బంగారు ETF అయిన నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీఈఎస్ ఉదాహరణను తీసుకుంటే, ఇది జూలై 2007లో ప్రారంభమైనప్పటి నుంచి 950% రాబడిని అందించింది. ఇది 18 ఏళ్లలో రూ. 10 లక్షల పెట్టుబడిని రూ.1 కోటి కంటే ఎక్కువ పెట్టుబడిగా మార్చిందని నిపుణులు వెల్లడించారు.
3. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్.. ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రక్చర్ ద్వారా స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్‌ల యూనిట్లను కొనుగోలు చేస్తాయి. పెట్టుబడిదారులు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిప్ కూడా ప్రారంభించవచ్చు. స్వచ్ఛమైన బంగారంలో నేరుగా పెట్టుబడి పెట్టకూడదనుకునే బిగినర్స్ ఇన్వెస్టర్లకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మంచివని నిపుణులు సూచిస్తున్నారు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలికంగా మంచి రాబడిని ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నారు.
4. సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBలు)
SGBలు అనేవి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా జారీ చేసే సెక్యూరిటీలు. SGBలు 999 స్వచ్ఛత కలిగిన బంగారంతో మద్దతు ఇవ్వబడతాయి. 8 ఏళ్ల లిమిట్ కలిగి ఉంటాయి. అయితే, జారీ చేసిన తేదీ నుంచి ఐదవ సంవత్సరం తర్వాత వాటిని ముందస్తుగా తిరిగి పొందేందుకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం, SGBలలో కొత్త పెట్టుబడులు అందుబాటులో లేవు. వాటిని ద్వితీయ మార్కెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. కొన్నేళ్లుగా బంగారం ధర పెరుగుదల నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా, SGBలు సాధారణంగా ప్రారంభ పెట్టుబడిపై 2.5% వార్షిక వడ్డీని అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: 2025 Nobel Prize Literature: క్రాస్జ్నా హోర్కెకు సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్..
