Dowry Harassment: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహితను కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరికి ఈ ఏడాది మే నెలలోనే వివాహం అయింది. అయితే, పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. ఇక, ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూసింది.. కానీ, పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు అయ్యింది.
Read Also: Coldref Cough Syrup Case: 20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..
మరోవైపు, భర్త ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల కిందట హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సాక్షి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆకాశ్ తల్లి ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. నా కొడుకు అదనపు కట్నం కోసం ఎలాంటి వేధింపులు చేయలేదన్నారు. కావాలనే సాక్షి కుటుంబం తప్పుడు ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు.
