GHMC Act | సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అవుట ర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బ న్) మూడు కార్పొరేష న్ల కు వ ర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మ హా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బ న్ చ ట్టం తయారు చేయాల ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమ తులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇత ర వ్యవహారాల న్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్ర తిష్టాత్మ కంగా చేపట్టనున్న 99 రోజుల కార్య క్రమంలో మున్సిప ల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతా మని సీఎం తెలిపారు. ఎంఏయూడీపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్ర వారం సమీక్ష నిర్వ హించారు. ప లు ప్రాంతాల్లో చెత్త ఎకడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని.. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక డ బోర్డులు ఏర్పాట్లు చేయాల ని సూచించారు. ఆ త ర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక డిపడితే అకడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేరొన్నారు.
కోర్ అర్బ న్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్య తాయుతంగా వ్య వహ రించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధిహామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులురావని.. అలాంటి సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. రోడ్డు నిర్మించిన త ర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి.. ఆ లోపు దానిని తొల గించినా… అక డ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నారు. ఎకడైనా సమస్య ఉంటే వెంటనే తెలుసుకొని పరిషరించాలన్నారు.
కోర్ అర్బ న్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎకువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త రచూ తనిఖీలు చేపట్టడంతో పాటు ప ర్యవేక్ష ణ కొనసాగాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోట ళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి వారికి రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 50 అంతస్తుల కుపైగా భవంతులు నిర్మాణాలు జరుగుతున్నాయ ని.. అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాల ని సీఎం సూచించారు.
వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. కోర్ అర్బ న్ ఏరియా పరిధిలో ఆర్ అండ్ బీ, ఇత ర విభాగాల ప రిధిలోని రోడ్ల న్నింటినీ ఎంఏయూడీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచ ర్ సిటీలో వివిధ ప్ర భుత్వ కార్యాలయాల భవ నాల పనులు వేగ వంతం చేయాల ని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్య త కు పెద్ద పీట వేయాల ని ముఖ్య మంత్రి ఆదేశించారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్య లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యద ర్శి రామ కృష్ణారావు, సీఎం ప్రిన్సిప ల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ , ఎంఏయూడీ ప్ర త్యేక ముఖ్య కార్యద ర్శి జయేశ్ రంజ న్ , హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్ డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, హైద రాబాద్ , సైబరాబాద్ , మలాజిగిరి కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి త దిత రులు పాల్గొన్నారు.
