Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. హరీశ్‌రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించి, పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు
హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్… https://t.co/ApC9XTf21H pic.twitter.com/3ANmabd84T
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
శుభప్రద్ పటేల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
