Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Heart Attack | గుండెపోటుతో మూడోతరగతి విద్యార్థి మృతి.. జగిత్యాలలో విషాదం

Ai generated article, credit to orginal website, April 8, 2026

Heart Attack | జగిత్యాల రూరల్‌, ఏప్రిల్‌ 7 : అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తోపారపు చంద్రశేఖర్‌-నవిత దంపతుల కుమారుడు నిశాంత్‌ (9) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసివెళ్లాడు. అప్పటిదాకా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన నిశాంత్‌ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • కార్య‌క‌ర్త‌ల కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్
  • జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌
  • నిజ‌మైన మ‌హాత్ముడు జ్యోతిబా పూలే : మోదీ
  • సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం
  • వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes