Heroins : తెలుగు నాట చాలా మంది హీరోయిన్లు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అందులో కొందరు సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నత వర్గాల ఇంటికి వెళ్లారు. కానీ కొందరు మాత్రం సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం జెనీలియా గురించే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2003లో పెళ్లి చేసుకుంది. ఈ రితేష్ దేశ్ ముఖ్ ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు.
Read Also : Janhvi Kapoor : అలాంటి సీన్లలో నటిస్తే తప్పేంటి.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
ఇక మాజీ ప్రధాని అయితే దేవెగౌడ ఇంటికి కోడలిగా వెళ్లింది హీరోయిన్ రాధిక. కుమారస్వామికి రెండో భార్యగా వెళ్లిన రాధిక.. సౌత్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కుమారస్వామిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ మధ్య హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఎందుకో తెలియదుగానీ క్యాన్సిల్ అయింది. లేదంటే ఆమె కూడా మాజీ సీఎం ఇంటికి కోడలు అయ్యేది.
Read Also : Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్..
