Hyderabad | చాటుమాటు సరసాలు ఆ వివాహితను చంపేశాయి. అప్పటికే పళ్లై భర్త, ఇద్దరు పిల్లలున్నప్పటికీ.. ప్రియుళ్లతో రహస్యంగా సాగించిన ప్రేమాయణంతో ఆమె జీవితం విషాదాంతమైంది. ఆమె వేసిన తప్పటడుగులతో ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన సంఘటన బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
సిటీబ్యూరో,జనవరి 12 : చాటుమాటు సరసాలు ఆ వివాహితను చంపేశాయి…ఇద్దరు ప్రియుళ్లతో రహస్యంగా సాగించిన ప్రేమాయణంతో ఆమె జీవితం విషాదాంతమైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ..వేసిన తప్పటడుగులతో ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ సంఘటన బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన కనీజ్ ఫాతిమా ఉరఫ్ జెబా(30) బేగంపేట్‌లోని ఊర్వశి పబ్‌లో జరిగే ఈవెంట్స్‌లో ఉద్యోగిని. ఫాతిమా.. కారు డ్రైవర్ నవాబ్ మసూద్ ఖాన్‌ను 14 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. గతంలో ఫాతిమా బంజారాహిల్స్‌లోని పబ్‌లో పనిచేసి.. అక్కడ ఉద్యోగం మానేశాక..పంజాగుట్టలోని ఊర్వశి పబ్‌లో చేరింది. నాలుగేళ్ల క్రితం బోరబండ అల్లాపూర్‌కు చెందిన ఎం.డి.జహీరుద్దీన్(31) పరిచయమయ్యాడు. ఇతనికి పెండ్లి అయి పిల్లలు ఉన్నారు.
అయినా ఫాతిమాతో వివాహతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం ప్రియురాలిని బైక్‌పై పికప్ చేసుకుని పబ్ దగ్గర వదిలిపెట్టడం..రాత్రి డ్యూటీ ముగిశాక ఆమెను ఇంటి వద్ద దిం పేయడం జహీరుద్దీన్ దినచర్యగా మారింది. కాగా.. ప్రియురాలి వ్యవహార శైలి పై అనుమాం కలిగిన జహీరుద్దీన్.. ఆమెకు తెలియకుండా ఆమె వాట్సాప్ స్కాన్ చేసి తన ఫోన్లోకి ఇన్స్టాల్ చేసుకున్నాడు. ప్రియురాలు చేసే చాటింగ్‌లు, ఆమెకు వచ్చే మెసేజ్‌లను చదివేవాడు. కాగా.. ఆదివారం తనకు వేరే పనుందని చెప్పిన ఫాతిమా..బోయిన్‌పల్లిలోని కొత్త ప్రియుడు ఇంటికెళ్లింది. వాట్సాప్ ద్వార విషయం తెలుసుకున్న అతను.. ఆమెపై పగ పెంచుకున్నాడు.
ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఊర్వశి పబ్ దగ్గరకు వెళ్లి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ..ఎర్రగడ్డలో మెంటల్ దవాఖానలోని మేల్ వార్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రియురాలిని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దాంతో ఆవేశానికి లోనైన జహీరుద్దీన్.. తెచ్చుకున్న కత్తితో ప్రియురాలిపై దాడి చేశాడు. కిందపడిన ఆమె తలపై గ్రానైట్ రాయితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి హత్య విషయం చెప్పి.. ఆ తర్వాత బోరబండ పోలీస్ స్టేషన్లో లొం గిపోయాడు. రంగంలోని దిగిన పోలీసులు ,క్లూస్ టీమ్ తో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఫాతి మా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ దవాఖాన మార్చురీకు తరలించారు. హతురాలి భర్త నవాబ్ మసూద్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
