హైదరాబాద్ : జలమండలి అధికారులు (HMWSSB) నేటి నుంచి(శుక్రవారం) నగరంలో బస్తీబాట పట్టనున్నారు. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడమే కాకుండా, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది. వారంలో నాలుగు రోజులు బస్తీలు, కాలనీల్లో తిరగాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి మేనేజర్ల వరకు అధికారులు అందరూ ప్రజలను ప్రత్యక్షంగా కలువనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత యథావిధిగా ఆఫీసుల్లో అందుబాటులో ఉండనున్నారు. కాగా, పురపాలక శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న రెండేండ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అరకొర నిధులు, పర్యవేక్షణ లోపంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజా సమస్యలే ఎజెండా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
