Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Hyderabad | బస్సు ప్రయాణం.. నరకప్రాయం.. రోజుకు 26 లక్షల మంది.. నడుస్తున్న సర్వీసులు 2900 మాత్రమే!

Ai generated article, credit to orginal website, February 19, 2026

Hyderabad | మహానగర జనాభా కోటి దాటింది.. కాలనీలూ విస్తరిస్తున్నాయి.. రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సినా.. ఆ దిశగా గ్రేటర్‌ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదు. ఉచిత బస్సుకు ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక.. ఇప్పుడు రోజుకు సుమారు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. రోజుకు ఇంత మంది ప్రయాణం.. కేవలం గ్రేటర్‌లో ఉన్న 2900 బస్సులపైనే ఆధారపడి ఉంది. రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నది. మరో 6 వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -సిటీబ్యూరో
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 ( నమస్తే తెలంగాణ ) : నగరం శరవేగంగా విస్తరిస్తున్న దరిమిలా ఆ స్థాయిలో ప్రభుత్వ రవాణా సదుపాయం కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రేటర్‌ శివార్లకు పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండటం లేదు. బస్సు సదుపాయం కల్పించాలని ఇప్పటికీ సంబంధిత డిపోల మేనేజర్‌ కార్యాలయాలకు శివారు ప్రాంతాల వాసులు అనేక సార్లు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఉద్దేమర్రి, హుషారుపల్లి, ఆదిబట్ల, దుండిగల్‌, మోకీల,శంకర్‌పల్లి, కొల్లూర్‌ నియోపాలిస్‌ సమీపంలోని ప్రాంతాలకు సమయపాలన లేని అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఆక్యుపెన్సీ లేదంటూ ఉన్న బస్సులను రద్దు చేయడంపై తెలంగాణ పేద ప్రజల సంక్షేమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
211బీ బస్సు గతంలో సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ జిల్లాలోని ఉద్దేమర్రి వరకు నడిచేది. ప్రస్తుతం ఈ సర్వీస్‌ను తగ్గించి కేవలం ఉదయం వేళలో యాద్రాసిపల్లి వరకు పరిమితం చేశారని సంస్థ ప్రెసిడెంట్‌ సత్తిరెడ్డి పేర్కొన్నారు. 211యూ బస్సు గతంలో హుషారుపల్లి వరకు ఉండేదని..దానిని ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుసార్లు డిపో మేనేజర్లకు విజ్ఞప్తులు చేసినా.. ప్రయోజనం లేదని వాపోయారు. మరోవైపు గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్‌ మీదుగా బస్సు నడపాలని ఇప్పటికే ఆర్టీసీకి వినతి పత్రాలు అందించారు. గండి మైసమ్మ మార్గంలో రాంపల్లి, దమ్మాయిగూడ, బాలాజీనగర్‌కు బస్సులు సరిపడా నడపాలని ఉద్యోగులు, విద్యార్థులు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందించారు.

రూట్‌ స్టడీ ఏదీ?
గ్రేటర్‌లో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఇ ప్పటికే ఉంది. కోటి జనాభా దాటిన మాహానగరంలో సుమారు 6వేల బస్సులు ఉండాలని నిపుణులు సూ చించారు. కానీ ఇప్పుడు కేవలం 2900 బస్సులు మా త్రమే రాకపోకలు సాగిస్తున్నా యి. ఈ క్రమంలో నగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో కాలనీ లు విరివిగా ఏర్పడుతున్నాయి. వారి రాకపోకలకు ఆర్టీసీ బస్సు లు సమకూర్చాల్సిన అవసరం అధికారులపై ఉందని ప్రజా సం ఘాలు చెబుతున్నాయి. రద్దీ ఎక్క డ ఉంది? బస్సులు సరిపడా ఉ న్నాయా? లేదా? అనే పరిశీలించే అధ్యయనాలు అధికారుల మరిచారని విమర్శలు వస్తున్నాయి.
ప్రయాణికులకు మెరుగైన సేవలదించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. ఏ రూట్లో బస్సులు పెంచాలో రిపోర్ట్‌ రెడీ చేయాలి. కానీ అధికారులు అలాంటి పరిశీలన ఉం డటం లేదు. సమీక్షలు సైతం చేయడం లేదు. ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్న ప్రయివేట్‌ డ్రైవర్లు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపుతుండటంతో బస్సెక్కెందుకు ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఈ సంఘటనలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో రద్దీ మార్గాల్లో బస్సులను మరింత తగ్గిస్తున్నారు. 30శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కూడారాత్రి 9 దాటితే బస్సులు తక్కువగా నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
పాస్‌లున్నా.. తప్పని తప్పలు
పాస్‌లున్నా.. బస్సుల్లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం స్కూల్‌, కాలేజీల సమయాల్లో బస్సులు సరిపడా రావడం లే దని చెబుతున్నారు. ఆ సమయాల్లో బస్సులు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన ఆర్టీసీ అధికారులు ప ట్టించుకోవడం లేదని వాపోయారు. ఫలితంగా కాలేజీలకు వెళ్లాలన్నా.. ఇంటికి రావాలన్నా బస్సుల్లో ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డిపో మేనేజర్లకు బస్సుల సంఖ్య పెంచాలని పలు వినతి పత్రాలు అందించామని వివరించారు. బస్సు పాసుల ధరలు పెంచడమే తెలుసు కానీ అందుకు తగ్గ బస్సులను ఏర్పాటు చేసే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ అధికారులకు బస్సులు సకాలంలో రావడం లేదని అనేక ఫిర్యాదులు చేసిన ఫలితం ఉండటం లేదన్నారు.
లక్ష సంతకాలు వృథానేనా?
గ్రేటర్‌లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. ఇదిలా ఉంటే.. నగరవాసులకు బస్సుల కోసం ఎదురుచూడలేక ఓలా, ఉబర్‌, ర్యాపిడోలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంటున్నది. ట్రాఫిక్‌ సమస్య దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆధారిత వాహన కంపెనీలు రెట్టింపు ధరలను వసూలు చేస్తున్నాయి. గ్రేటర్‌లో ఉచిత బస్సు పథకానికి ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణించేవాళ్లు. మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. దీంతో ప్రతీ బస్సు కిక్కిరిపోతున్నది. సరిపడా బస్సులు ఉండక గత్యంతర లేక ప్రయాణికులు ఉన్న సర్వీసుల్లోనే వేలాడుతూ.. గమ్యస్థానాలకు చేరుతున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • 100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్
  • మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి
  • 15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్
  • పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం
  • ఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీ

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes