Ind vs Aus 4th T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో ఒక్క మ్యాచ్ గెలవడంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించడానికి నాల్గవ టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ నేడు (నవంబర్ 6) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు వేదికగా ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలోని బిల్ పిప్పెన్ ఓవల్ మైదానం ఆతిధ్యం ఇవ్వనుంది.
RCB For Sale: అమ్మకానికి ఐపీఎల్ ఛాంపియన్ టీం.. ధర ఎంతంటే..?
ఈ స్టేడియంలో పిచ్ నుండి మొదట ఓవర్లలో బౌలర్లకు మంచి సహాయం లభిస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ మైదానంలో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. పిచ్ రిపోర్ట్ ప్రకారం మొదట్లో బంతి కదలిక కారణంగా బ్యాట్స్‌మెన్‌లు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ముందుకు సాగేకొద్దీ పిచ్ బ్యాటింగ్ కు సులభమవుతుంది. చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌లు పరుగులు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ హై-స్కోరింగ్ గేమ్‌గా మారే అవకాశం ఉంది.
ఇక ఇరుజట్ల హెడ్-టు-హెడ్ గణాంకాలను పరిశీలిస్తే భారత్ ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డును కలిగి ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 35 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ 21 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌లు గెలిచింది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. జనవరి 2021 నుండి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 12 మ్యాచ్‌లలో భారత్ 8 విజయాలు నమోదు చేసి, కేవలం 3 మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుత 5 టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడం, రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవడం. మూడో మ్యాచ్ టీమిండియా గెలవడంతో సిరీస్ 1 – 1 గా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరుజట్లకు ముఖ్యం కానుంది.
Kidney Stones: ఈ అలవాట్లు మార్చకోకపోతే మీ కిడ్నీలను మర్చిపోవాల్సిందే.. జాగ్రత్త గురూ..!
ఇక తుది జట్ల అంచనాల విషయానికి వస్తే.. భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే లేదా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది. మరోవైపు, మిచెల్ మార్ష్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లీస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు ఉండవచ్చని అంచనాగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టనున్నాయి.
