INDW vs SAW: మహిళల వన్డే ప్రపంచ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజు (నవంబర్ 2న) ఢిల్లీలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇరు జట్లు లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హర్మన్ సేన సిద్ధమైంది. సెమీస్‌లో రెండు జట్లూ అద్భుత విజయాలతో ఫైనల్ కు అర్హత సాధించాయి. ఇక, ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా, దక్షిణాఫ్రికా ఈసారి కప్ కొట్టాలని చూస్తుంది. ఈ మైదానంలో టీమిండియాకు బాగా అనుకూలమైంది కాగా.. సౌతాఫ్రికా ఈ టోర్నీలో తొలిసారి ఇక్కడ మ్యాచ్ ఆడబోతుంది.
Read Also: Vikarabad: దారుణం.. భార్య, కూతురు, వదినను నరికి చంపిన వ్యక్తి.. ఆపై తానూ ఆత్మహత్య..
భారత్ కి మూడో ఫైనల్..
అయితే, భారత మహిళలకు ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. 2005లో మొదటిసారి ఫైనల్ కు వెళ్లిన టీమిండియా.. ఆసీస్ చేతిలో 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 4 వికెట్లకు 215 రన్స్ చేయగా.. మిథాలి రాజ్ నేతృత్వంలోని జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. 2017లో ట్రోఫీకి అత్యంత చేరువగా వెళ్లిన టీమిండియా.. 9 పరుగుల స్వల్ప తేడాతో కప్ చేజార్చుకుంది. అప్పుడూ కూడా కెప్టెన్ మిథాలినే. 229 రన్స్ ఛేదనలో భారత జట్టు 219 పరుగులకు కుప్పకూలిపోయింది. మరోవైపు, దక్షిణాఫ్రికా మొదటిసారి ఫైనల్ కు చేరుకుంది.
Read Also: Koti Deepotsavam 2025: కన్నుల పండువగా కోటి దీపోత్సవం.. నేడు ప్రత్యేక పూజలు..
ఈ ముగ్గురు చెలరేగితే అంతే సంగతి..
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన జట్టునే టీమిండియా కొనసాగించే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడి మెరుపు ఆరంభం ఇచ్చే అవకాశం ఉంది. సెమీస్‌లో అనూహ్య రీతిలో వెనుదిరిగిన స్మృతి మందన తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మన జట్టు ఓపెనింగ్‌తో మంచి ఆరంభం వస్తుంది. జెమీమా, హర్మన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, రిచా ఘోష్ భారీ షాట్లకు పెట్టింది పేరు.. దీంతో మిడిల్ ఓవర్లలో సమర్థంగా ఆడే దీప్తి కూడా రాణిస్తే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదని చెప్పాలి. అదనపు బ్యాటింగ్ కోసం ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను తీసుకోవాలని చూస్తున్నప్పటికీ.. దక్షిణాఫ్రికా జట్టులో అందరూ కుడి చేతివాటం బ్యాటర్లే ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధనే కొనసాగించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక, రేణుక సింగ్, క్రాంతి గౌడా తమ పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు.
Read Also: Kashibugga Stampade: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన బలం అదే..
అసాధారణ బ్యాటింగ్‌తో కెప్టెన్ లారా వోల్‌వార్ట్ దూసుకుపోతుండటం దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన బలంగా చెప్పాలి. గత మ్యాచ్‌లో ఆమె మెరుపు శతకంతో చెలరేగింది. టోర్నమెంట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో ఓపెనర్ బ్రిట్స్ తుది పోరులో సత్తా చాటాలని చూస్తుంది. లూస్, మరిజాన్ కాప్‌లతో మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉంది. వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై చెలరేగి ఒక్కసారి స్టార్‌గా మారిన డిక్లెర్క్ వంటి బ్యాటర్ 9వ స్థానంలో ఆడే ఛాన్స్ ఉండటం సఫారీ టీమ్‌కు కలిసొచ్చింది. ఆల్‌రౌండర్ క్లో ట్రయాన్ కూడా మ్యాచ్ ఫలితాన్ని ఈజీగా మార్చేయగలదు.. కాగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 34 వన్డేలు జరగ్గా.. అందులో టీమిండియా 20 మ్యాచ్ లలో గెలిచి 13 ఓడింది. మరో మ్యాచ్ టై అయింది.
Read Also: Jatdhara: ఫిజికల్‌గా .. నా కెరీర్‌లో ఇది అత్యంత కష్టమైన పాత్ర..
తుది జట్ల అంచనా:
టీమిండియా: స్మృతి మందన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోచ్, అమన్‌జ్యోత్ సింగ్, స్నేహ్/రాధ, శ్రీచరణి, క్రాంతి గౌడా, రేణుక సింగ్..
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకె బోష్, సున్ లుజ్, మరిజేన్ కాప్, సినాలో జఫ్టా, అనెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నదైన్ డిక్లెర్క్, ఖకా, ఎంలబా
