Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

INDW vs SAW | సునామీలా విరుచుకుపడిన రీచా‌‌.. సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా..!

Ai generated article, credit to orginal website, October 9, 2025

INDW vs SAW  : వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న రీచా ఘోష్‌ (94) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడింది. వైజాగ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా.. ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఫినిషర్ పాత్రను పోషిస్తూ సఫారీ బౌలర్లను హడలెత్తించిన రీచా.. డెత్ ఓవర్లలో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. 153కే ఏడు వికెట్లు పడిన దశలో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అమన్‌జోత్ కౌర్ అండగా 51 పరుగులు, స్నేహ్ రానా(33)తో ఎనిమిదో వికెట్‌కు విలువైన 88 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఆమె ఊచకోత కారణంగా భారత జట్టు 251 పరుగులు చేయగలిగింది.
వరల్డ్ కప్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై తడబడినా ఆఖర్లో పుంజుకుంది. టెయిలెండర్లు రీచా ఘోష్ (94), స్నేహ్ రానా (33)ల అసాధారణ పోరాటంతో సఫారీ బౌలర్లు డీలా పడగా.. ప్రత్యర్థికి ఏకంగా 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వైజాగ్ స్టేడియంలో భారత బ్యాటర్లు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. స్మృతి మంధాన (23) ప్రతీకా రావల్(37) తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(0) చోలే ట్రయాన్ వేసిన 21వ ఓవర్లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డకౌట్‌ అయింది. దాంతో.. 92 వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది.

𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗥𝗶𝗰𝗵𝗮 𝗚𝗵𝗼𝘀𝗵 – 𝗪𝗵𝗮𝘁 𝗔 𝗞𝗻𝗼𝗰𝗸!
9⃣4⃣ Runs
7⃣7⃣ Balls
1⃣1⃣ Fours
4⃣ Sixes
Drop your reaction in the comments below on that stunning innings!
Updates https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/xLdVOEX8In
— BCCI Women (@BCCIWomen) October 9, 2025

ఆ సమయంలో జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), దీప్తి శర్మ(4)లు కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్ వైఫల్యంతో కష్టాల్లో పడిన జట్టును గట్టెక్కించే భాద్యత తీసుకుంది రీచా ఘోష్‌(94). తన సహజ శైలిని పక్కన పెట్టి.. అమన్‌జోత్ కౌర్‌(13)తో స్కోర్‌బోర్డును నడిపించింది. వీర్దిదరూ అర్ధ శతకం భాగస్వామ్యంతో కోలుకుంటున్న టీమిండియాను ట్రయాన్ మళ్లీ దెబ్బకొట్టింది. 51 పరుగులు జోడించిన అమన్‌జోత్ వికెట్ తీసి టీమిండియా కష్టాలను మరింతం పెంచిందీ స్పిన్నర్.
గేర్ మార్చిన రీచా
అమజ్ జోత్ కౌర్ వికెట్ పడ్డాక భారత్ స్కోర్.. 153-7. ఆ దశ నుంచి కోలుకుంని 200 కొట్టడం గగమనే అనిపించింది. కానీ, పాకిస్థాన్‌పై మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన రీచా నేనున్నాగా అంటూ గేర్ మార్చి విధ్వంసక ఆటకు తెరతీసింది. మరో ఎండ్‌లో స్నేహ్ రానా (33) సైతం డీక్లెర్క్ ఓవర్లో రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చింది. అనంతరం ఆమె ఓవర్లో సిక్సర్‌, ఫోర్ బాదిన రీచా.. సింగిల్ తీసి వన్డేల్లో ఏడో హాఫ్ సెంచరీ సాధించింది.

A brisk 5⃣0⃣-run stand!
Richa Ghosh Sneh Rana#TeamIndia move past 200.
Updates https://t.co/G5LkyPuC6v#WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/RxIzRMozBz
— BCCI Women (@BCCIWomen) October 9, 2025

ఆ తర్వాత వచ్చిన మరినే కాప్‌ వేసిన 46వ ఓవర్లో రీచా బౌండరీతో స్కోర్ 200 మార్క్ అందుకుంది. సఫారీ పేసర్ ఖాకాకు చుక్కలు చూపిస్తూ మూడు ఫోర్లు, చివరి బంతిని సిక్సర్‌తో 19 రన్స్ పిండుకుందీ చిచ్చరపిడుగు. వీరిద్దరిని ఆపేందుకు రంగంలోకి దిగిన మరినే కాప్‌.. రానాను ఔట్ చేసి 88 పరుగుల భాగస్వా్మ్యాన్ని విడదీసింది. డిక్లెర్క్ వేసిన 50వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో సెంచరీకి చేరువైన ఈ వికెట్ కీపర్ లాంగాన్‌లో ట్రయాన్ చేతికి చిక్కింది. తర్వాతి బంతికి శ్రీచరణి ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 251 వద్ద ముగిసింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
  • Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
  • Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !
  • CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్
  • Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes