Janhvi Kapoor : బోల్డ్ సీన్లలో నటించడంపై ఎప్పటి నుంచో రకరకాల కామెంట్లు హీరోయిన్ల నుంచి వస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నటించాల్సి వస్తోందని చెబుతున్నారు. పర్సనల్ గా పెద్దగా ఇష్టం లేకపోయినా కేవలం కథ కోసమే అంటున్నారు. ఇంకొందరేమో అలాంటి సీన్లలోనూ నటిస్తేనే కదా సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక తాజాగా జాన్వీకపూర్ మాత్రం బోల్డ్ సీన్లపై ఓపెన్ గానే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఈ రోజుల్లో బోల్డ్ అనేది చాలా కామన్ పదం అయిపోయింది. అలాంటి సీన్లలో నటిస్తే అసలు తప్పేంటి.. దాన్ని ఎందుకు తప్పుగా చూడాలి. అది కూడా సినిమాలో భాగమే కదా అంటూ తెలిపింది.
Read Also : Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్..
బోల్డ్ అనే పదాన్ని ముందు నుంచే మన సమాజం తప్పుగా చెబుతూ వచ్చింది. అందుకే ఆ సీన్లలో నటిస్తే వేరేలా చూస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. బోల్డ్ సీన్లలో నటించినా సరే ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ అందరిలోనూ రావాలి. అప్పుడే మన సినిమాలలో ఎలాంటి తప్పులు మనకు కనిపించవు. సినిమాలో అన్ని రకాల సీన్లు పెడితేనే అది సంపూర్ణ సినిమా అవుతుంది. అంతే తప్ప ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే సంపూర్ణ సినిమా ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో ఆమె కామెంట్లు చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే జాన్వీకపూర్ ఇప్పటి వరకు పెద్దగా బోల్డ్ సీన్లలో కనిపించలేదు.
Read Also : Allu Arjun : బన్నీ చేసిన పనికి రూ.40 కోట్లు నష్టపోయిన అరవింద్..
