Jogi Ramesh Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు జోగి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఇక, ఈరోజు తెల్లవారుజామున జోగి ఇంటికి వెళ్లిన పోలీసులు.. సుమారు 3గంటల వరకు రమేశ్ డోర్ తీయకపోవడంతో ఇంటి బయటనే పోలీసులు వేచి ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి డోర్ ఓపెన్ చేయటంతో జోగితో పోలీసులు మాట్లాడి.. నోటీసులు అందజేసిన తర్వాత అరెస్ట్ చేశారు.
