Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Jubilee Hills Bypoll Results | జూబ్లీహిల్స్‌లో ఈవీఎం ఓట్ల లెక్కింపు షురూ..

Ai generated article, credit to orginal website, November 14, 2025

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Bypoll Results) కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్‌పేట డివిజన్‌లోని ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఎర్రగడ్డ డివిజన్‌లోని ఓట్లను లెక్కిస్తారు. కాగా, పోస్టల్‌ ఓట్లలో బీఆర్‌ఎస్‌ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓట్ల లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాలు పట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుంది. అయితే 10 గంటల వరకు ఫలితంపై ఒక స్పష్టత రానుంది.
ఈ నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోరబండ్‌ డివిజన్‌లో 29,760 మంది ఓట్లు వేయగా, రహమత్‌నగర్‌ డివిజన్‌లో 40,610 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్‌లో 29,112 ఓట్లు, వెంగళరావ్‌నగర్‌లో 25,195 ఓట్లు, షేక్‌పేట డివిజన్‌లో 31,182 ఓట్లు, యూసఫ్‌గూడలో 24,219 ఓట్లు, సోమాజిగూడలో 14,553 ఓట్లు పోలయ్యాయి.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Aamir Khan about Falling in Love at 60
  • Bigg Boss Telugu 9: Fun, Games and a Shocking Elimination as Rithu Leaves
  • Hyderabad May Soon Host Roads Named After Global Icons and Tech Giants
  • New Case Filed Against YSRCP Leader Kakani Govardhan Reddy
  • Dhurandhar trending in Telugu Multiplexes

Recent Comments

No comments to show.

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes