Jubilee Hills Bypoll Results Live Updates: హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది.. 10 రౌండ్స్ లో 42 టేబుల్స్ గా కౌంటింగ్ జరుగుతుంది.. ఒక్కో టేబుల్ కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.. 186 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.. మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.. ఇక, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..
