కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక సినిమా థియేటర్లలో ఇంకా మంచి రన్ చేస్తుండగానే, మేకర్స్ దీపావళి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
Also Read : Prabhas : ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్ ట్రిపుల్ ట్రీట్ రెడీ!
దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి కొత్త ట్రైలర్‌ను అక్టోబర్ 16న మధ్యాహ్నం 12.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి కొత్త ట్రైలర్‌లో ఎలాంటి విజువల్స్, ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అన్న ఆసక్తి అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు.. సంగీతాన్ని అందించిన అజనీష్ లోక్‌నాథ్ మరోసారి తన మ్యూజిక్ మాజిక్‌తో కొత్త హైప్ తెచ్చాడు. గ్రామీణ నేపథ్యం, ఫోక్ మ్యూజిక్, మిస్టిక్ ఎలిమెంట్స్ కలయికలో అద్భుతమైన ఆడియో అనుభూతి ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను హొంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించగా. మొత్తానికి ఈ దీపావళి రిషబ్ శెట్టి ఫ్యాన్స్‌కి నిజంగా స్పెషల్ కానుంది. “దీపావళి దీపాల కాంతి కంటే ‘కాంతార’ కాంతి ఎక్కువగా మెరుస్తుందనడంలో సందేహమే లేదు.
