కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన “కాంతార చాప్టర్ 1” సినిమా థియేటర్లలో ఘనవిజయాన్ని సాధిస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో, సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలమైన రన్ కొనసాగుతోంది. గ్రామీణ దేవత కథ, ఆధ్యాత్మికత, యాక్షన్, మానవ సంబంధాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కాంతార సిరీస్‌కు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అనే ప్రశ్న అభిమానులందరిలోనూ చర్చనీయాంశమైంది. సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ తమ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేయడంతో, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read : Chiranjeevi : చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో.. ?
ఆ పోస్టులో “మేము మీ ఫేవరెట్ చాప్టర్‌ని త్వరలో తెస్తున్నాం” అనే లైన్ ఉండడంతో, కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ దగ్గరలోనే ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రైమ్ వీడియో అధికారిక డేట్ ప్రకటించలేదు. కానీ ఈ టీజ్ చూసి, నవంబర్‌లో లేదా డిసెంబర్ మొదట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కాంతార విశ్వానికి ఆరంభం చెప్పిన కథగా నిలిచింది. ప్రీక్వెల్ తరహాలో తీసిన ఈ చిత్రం ద్వారా రిషబ్ తన డైరెక్షన్, యాక్టింగ్ నైపుణ్యాలతో మళ్లీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇక థియేటర్లలో దుమ్మురేపుతున్న కాంతార చాప్టర్ 1 ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
