Karur Stampede: కరూర్‌లో నిర్వహించిన దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. తాజాగా ఈ అంశంపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అక్టోబర్ 27న చెన్నైలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. ఈ తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత ఈ తరుణం చోటు చేసుకోనుంది.
READ MORE: Bollywood : మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేయనున్న హ్యుమా ఖురేషీ
విజయ్ పార్టీ తమిళగ వెట్టి కజగం (టీవీకే) ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. 50 గదులు బుక్ చేశారు. విజయ్ ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి తన సంతాపాన్ని తెలపనున్నారు. బాధిత కుటుంబాలు కరూర్ నుంచి మహాబలిపురం చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేసింది. అయితే.. సమావేశంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. బాధితుల కుటుంబాలను కలవడానికి విజయ్ స్వయంగా కరూర్ వెళ్లి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు భద్రత, అనుమతి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
READ MORE: Shah Rukh Khan: అలియా ‘ఆల్ఫా’లో షారుక్ ఖాన్ సీక్రెట్ రోల్..?
అసలు ఏం జరిగింది..?
సెప్టెంబర్ 27న కరూర్ వేలుచామిపురంలో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట జరిగి, 41 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
