Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

KTR | బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌.. కేటీఆర్‌ హౌస్‌ అరెస్ట్‌.. నంది నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు

Ai generated article, credit to orginal website, October 9, 2025

హైదరాబాద్‌: ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను (KTR) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నంది నగర్‌లోని కేటీఆర్‌ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకుల ఇండ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై, ప్రభుత్వం పైన కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి ఒక లేక ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తామంటే తమ ఇంటి ముందు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారని మండిపడ్డారు. తమను నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిదని హితవు పలికారు. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని, ఇలాంటి పోలీసు నిర్బంధాలు తముకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు.

All I wanted to do is board an RTC bus peacefully, travel to RTC MD office & submit a letter demanding roll back of steep hike in Bus ticket fares
Look at the number of police officers deployed right now outside my housing complex!!
All to prevent one person from boarding a Bus… pic.twitter.com/x2lRruoZ4T
— KTR (@KTRBRS) October 9, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్
  • Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు
  • CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం
  • TTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం
  • Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes