KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో 11 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద 12.30 గంటలకు, తెలంగాణ చౌక్‌లో 1.30 గంటలకు జరిగే కార్నర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కేటీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 30 గంటలకు సిరిసిల్ల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని బాబాజీ కాలనీవాసులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు 8, 9వ వార్డుల ప్రజలను ఉద్దేశించి పెద్దూరు చౌరస్తాలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు 10, 22వ వార్డుల ప్రజలను ఉద్దేశించి తారకరామ నగర్ చౌరస్తాలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు 3,4,15,16 వార్డుల ప్రజలను ఉద్దేశించి విద్యానగర్ చౌరస్తాలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు 5, 17వ వార్డు ప్రజలను ఉద్దేశించి సుభాష్ నగర్ సర్కిల్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు 26, 28, 39 వార్డుల ప్రజలను ఉద్దేశించి నేతన్న చౌక్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు 25, 38 వార్డుల ప్రజలను ఉద్దేశించి పద్మనగర్ హనుమాన్ టెంపుల్ చౌరస్తాలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు 12 వ వార్డు ప్రజలను ఉద్దేశించి చంద్రంపేట లో ప్రసంగిస్తారు.
