వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంక రౌరి, లీల సామ్సన్..ఢిల్లీ గణేశన్( స్వర్గీయ), గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాకి రవి గోగుల డైరెక్ట్ చేశారు. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా గతేడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హీరో వీర్ రెడ్డి వృత్తిరీత్యా లాయర్, అలాగే ఒక లీగల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమా ఆయన స్వయంగా హీరోగా నటించడం గమనార్హం.
Also Read : Prabhas : ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్ ట్రిపుల్ ట్రీట్ రెడీ!
థియేటర్ లో హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో లీగల్లీ వీర్ స్ట్రీమింగ్ అవుతుండగా ఆ ప్లాట్‌ఫామ్‌లో టాప్ 5 ట్రెండింగ్ ఒకటిగా నిలిచింది. మలికిరెడ్డి వీర్ రెడ్డి తన తండ్రికి నివాళి గా తెరకెక్కిన ఈ చిత్రంలో రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. మిగతా కోర్టు రూమ్ డ్రామా సినిమాలలో ఉన్నట్లు ఈ సినిమాలో మెలో డ్రామా ఉండదు. నిజంగా కోర్టులో ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతారు. అనే విషయాలను కూడా సినిమాలో డిస్కస్ చేశారు. ఒక మర్డర్ మిస్టరీ తో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్ అలాగే ఇండియా వచ్చిన ఒక ఎన్నారై కి ఎదురైన కష్టాలు వంటివి బాగా చూపించారు.
“వీర్ పాత్ర పోషించడం కష్టమైనా సరే నిజాయతీగా చేశాను. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా చేశాను. ఈ కథ నాకు చాలా వ్యక్తిగతమైనది మరియు నా ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని విలువలతో రూపొందించిన ఈ సినిమా నా తండ్రికి నివాళి.
లీగల్లీ వీర్ ఇప్పుడు OTTలో విడుదలైంది. ఈ చిత్రం ఇప్పుడు లయన్స్‌గేట్ ప్లేలో తెలుగు మరియు హిందీలో ప్రసారం అవుతోంది మరియు లయన్స్‌గేట్‌లో అలాగే డిసెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో కూడా అందుబాటులోకి రానుంది.
