Telangana Local Body Elections 2025: నేడు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. రెండు విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించనున్నారు. ఈనెల 23న మొదటి విడత MPTC, ZPTC పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
READ MORE: Jubilee Hills Election’s : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
