Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Love Birds | లవ్ బర్డ్స్.. అసలు ప్రేమికులను చిలకా గోరింకలతో ఎందుకు పోలుస్తారో తెలుసా!

Ai generated article, credit to orginal website, February 14, 2026

Love Birds | ప్రేమికుల్ని ‘లవ్‌ బర్డ్స్‌’ అంటూ సంభోదిస్తుంటారు. ‘ప్రేమ పక్షులు’ అని ఆట పట్టిస్తుంటారు. లేదంటే, ‘చిలకా-గోరింక’.. పోలికలు పెట్టేస్తుంటారు! అసలు, ప్రేమలో ఉన్నవారిని ఇలా పక్షులతో ఎందుకు పోలుస్తుంటారు? అంటే.. పక్షుల ప్రపంచంలోనూ ‘ప్రేమ’ అనేది అందమైన అనుభవమని నిపుణులు చెబుతున్నారు. మనుషులకు ఏమాత్రం తీసిపోని ‘ప్రేమ’ను కురిపిస్తాయని అంటున్నారు.
జీవితాంతం తోడూనీడగా..
మనుషులే కాదు.. పక్షులూ జీవితాంతం తోడూనీడగా కలిసి ఉంటాయి. భాగస్వామి దూరమైతే.. బాధతో విలవిల్లాడిపోతాయి. ఇలాంటి పక్షుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. లవ్‌బర్డ్స్‌ గురించి. ఆఫ్రికాలో కనిపించే రంగురంగుల చిలుకల్నే ‘లవ్‌ బర్డ్స్‌’గా పిలుస్తుంటారు. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జతకూడి ఉంటాయి. ఎప్పుడూ కలిసి తిరుగుతూ, ఒకదానికొకటి ప్రేమగా తినిపించుకుంటూ.. అన్యోన్యంగా జీవిస్తాయి. ఇక ప్రేమకు చిహ్నాలుగా నిలిచే మరో పక్షి జంట.. హంసలు. ఆ జంటలో ఒకటి చనిపోతే, రెండోది కూడా బాధతో కుంగిపోతుందట. కొన్నిసందర్భాల్లో ప్రాణాలు కూడా వదిలేస్తాయట. ఇక సారస్‌ కొంగల జంటల్లోనూగాఢమైన అనుబంధం ఉంటుంది.
గిఫ్ట్‌-ప్రపోజల్‌..
బహుమతులు ఇవ్వడం, ప్రేమను వ్యక్తం చేయడం.. పక్షుల్లోనూ కనిపిస్తుంది. లవ్‌ ప్రపోజ్‌ చేయడంలో జెంటూ పెంగ్విన్లు ముందుంటాయి. మనసులో ఉన్న ఆడ పెంగ్విన్‌కు అందమైన గులకరాయిని గిఫ్ట్‌గా ఇచ్చి.. తన ప్రేమను ప్రపోజ్‌ చేస్తాయి. ఆ రాయితోపాటు ఇచ్చిన పక్షి కూడా నచ్చితే.. ఆడ పెంగ్విన్‌ దాన్ని స్వీకరించి, తన గూడులో పెట్టుకుంటుంది. అప్పటినుంచి అవి రెండూ జతగా కూడుతాయన్నమాట. ఇక గిజిగాడు లాంటి పక్షులు.. కష్టపడి పనిచేసి, ఆడ పక్షులను ఆకర్షిస్తాయి. అందమైన గూళ్లు కట్టి.. వాటికి కానుకగా అందిస్తాయి. ఆడ పక్షికి ఆ గూడు నచ్చితేనే.. ఆ మగ పక్షిని స్వీకరిస్తుంది. జంటగా కలిసి.. అదే గూడులో కాపురం
పెడుతుంది.
టాలెంట్‌ చూపించి..
అమ్మాయిని పడేయడానికి అబ్బాయి రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూనే ఉంటాం. ఈ ట్రెండ్‌ పక్షుల్లోనూ కనిపిస్తుంది. నృత్యం చేయడం, పాటలు పాడటం.. ఇలా తమ టాలెంట్‌ మొత్తాన్నీ బయటపెడతాయి. ఆడ పక్షి మనసును గెలుచుకుంటాయి. ఆడ నెమలిని ఆకర్షించడానికి..
మగ నెమలి తన పింఛాన్ని విప్పి నాట్యం చేయడం మనకు తెలిసిందే! అలాగే గ్రేట్‌ క్రెస్టెడ్‌ గ్రీబ్స్‌ పక్షులు కూడా నీటిపై నృత్యాలు చేస్తాయి. ఇక కోయిల వంటి పక్షులు.. తమ మధురమైన గొంతుతో పాటలు పాడి, తమ భాగస్వామిని ఇంప్రెస్‌ చేస్తాయి.
బాధ్యతలు పంచుకొని..
ప్రేమించడం, ఒక్కటవ్వడం మాత్రమే కాదు.. బాధ్యతల్ని పంచుకోవడంలోనూ పక్షులకు సాటిలేదు. గుడ్లు పొదగడం మొదలుకొని, పిల్లలకు ఆహారం అందించే వరకూ.. రెండూ కలిసి పని చేస్తాయి. హార్న్‌బిల్స్‌ లాంటి జాతుల్లో.. ఆడపక్షి గుడ్ల మీద ఉన్నప్పుడు, అన్నీ మగపక్షే చూసుకుంటుంది. బయటి నుంచి ఆహారం తెచ్చి ఆడపక్షికి అందిస్తుంది. తన భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌టాక్షం
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం
  • మ‌హా శివ రాత్రి కోసం శ్రీ‌శైలంలో భారీ భ‌ద్ర‌త‌
  • రూ. 1 ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌
  • స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి బ్ర‌హ్మైక్యం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes