Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Man molests woman’s body | మార్చురీలోని మహిళ మృతదేహంపై వ్యక్తి లైంగిక దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తింపు

Ai generated article, credit to orginal website, October 9, 2025

భోపాల్‌: మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. (Man molests woman’s body) సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని మార్చురీలో పోస్ట్‌మార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఉంచారు. అయితే స్ట్రెచర్‌పై ఉన్న మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్లాడు. లైంగిక చర్యకు పాల్పడ్డాడు.
కాగా, ఏడాది కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా బయటపడింది. 2024 ఏప్రిల్‌ 18న సాయంత్రం 6.45 గంటలకు ఇది జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారి డాక్టర్ ఆదియా దావర్ అక్టోబర్ 7న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను నిందితుడిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్‌ కోసం జైలుకు తరలించారు.
అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

A man arrested in MP’s Burhanpur district for ‘abusing’ a woman’s body at a community health centre. The shocker became public after videos of the April 2024 incident went viral. It exposed state of security at govt health facilities. @santwana99 @jayanthjacob @NewIndianXpress pic.twitter.com/rjoPihyUqF
— Anuraag Singh (@anuraag_niebpl) October 8, 2025

Also Read:
Man Kills Wife | భార్యను చంపి.. మృతదేహాన్ని మంచం కింద దాచిన వ్యక్తి
Elephants Trample Man | మానసిక వికలాంగుడిని.. తొక్కి చంపిన ఏనుగులు
Prashant Kishor | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు.. 51 మంది అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి జాబితా

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
  • ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్
  • రుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టు
  • వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం
  • కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes