పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అయితే ఈ సారి మామూలుగా ఉండదు… ఊచకోతే.. అంటూ … పాకిస్థాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వెయ్యి ప్రగల్భాలు పలికి భారత్‌ను భయపెట్టలానుకునే పాక్ మార్గదర్శక సూత్రం ప్రకారం అక్కడి నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం చేసే సామర్థ్యం లేదని, కానీ సరిహద్దు దాటి పిచ్చి చేష్టలు చేస్తుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ 23, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసారన్ మెడోలో జరిగిన ఉగ్రవాద దాడిని ఉదాహరణగా పేర్కొన్న కటియార్, దాని మాదిరిగా మళ్లీ దాడులు జరిగితే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ మరింత ఘాతకంగా… శక్తివంతంగా జరుగుతుందని హెచ్చరించారు. మే 2025లో జరిగిన మొదటి ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్టులు, ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రతిస్పందన పాకిస్తాన్‌కు భారీ నష్టాలు కలిగించిందని ఆయన తెలిపారు. ‘ఈసారి మన చర్య మునుపటి కంటే మరింత ఘోరంగా ఉంటుంది. మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత భయంకరంగా ఉండాలి. దీనిపై సందేహం లేదు’ అని కటియార్ చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ‘భారత్‌తో యుద్ధ అవకాశాలు చాలా రియల్’ అని చెప్పిన నేపథ్యంలో కటియార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సైనికులు, ప్రజలు జాగ్రత్తగా ఉండి, జాతీయ భద్రతకు సహకరించాలని కటియార్ పిలుపునిచ్చారు.
‘‘ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్ కు గట్టి బదులిచ్చాం. కానీ దాయాది ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు. పహల్గాం తరహాలో మరోదాడికి యత్నించవచ్చు. అందుకే దాని ప్రతి కదలికపై మేం దృష్టిసారించాం. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే.. మనం ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదు’’ అని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మంగళవారం లొంగిపోయాడు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధ్రువీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబరులో మల్లోజుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ కూడా మద్దతిచ్చింది. అయితే, మల్లోజుల లేఖను హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం అతడు మరో లేఖ విడుదల చేశాడు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని అందులో పేర్కొన్నాడు.
‘‘ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం నేను అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యం చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదు’’ అని మల్లోజుల తన లేఖలో తెలిపాడు.
The post Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
