Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు. లక్నోలో BSP వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 19వ వర్ధంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మాయావతి.. దళిత నేతల స్మారక చిహ్నాలను చక్కగా నిర్వహిస్తున్నారని సీఎం యోగిని ప్రశంసించారు. అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు వీటిని పట్టించుకోలేదని విమర్శించారు.
Read Also: HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో అందరిపై హెచ్ఐవీ రక్తం
“సందర్శకుల నుండి వసూలు చేసిన టికెట్ డబ్బును నిర్వహణ కోసం ఉపయోగించాలని నేను ముఖ్యమంత్రికి లేఖ రాశాను. ఈ డబ్బును వేరే చోటికి మళ్లించబోమని, నిర్వహణ కోసం మాత్రమే ఉపయోగిస్తామని బిజెపి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, వారు మాట నిలబెట్టుకున్నందుకు మా పార్టీ వారికి కృతజ్ఞతలు తెలుపుతోంది,” అని ఆమె ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దళితుల స్మారక చిహ్నాలకు, పార్కుల్ని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వాటి నిర్వహణకు ఆయన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేనది అన్నారు. వారు అధికారంలో లేనప్పుడు కాన్షీరామ్ వంటి నేతల గౌరవార్థం సెమినార్లు నిర్వహిస్తామని హడావుడి చేస్తారని చెప్పారు. తన హయాంలో అనేక యూనివర్సిటీలు, సంస్థలకు కాన్షీరామ్ పేరు పెడితే అఖిలేష్ సర్కార్ వాటన్నింటిని మూసేసిందని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనకబడిన వారు, మైనారిటీలను గుర్తుంచుకోరని దుయ్యబట్టారు.
