Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Ai generated article, credit to orginal website, October 19, 2025

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు మంత్రి. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు.
IT Minister Nara Lokesh Australia Tour
కాగా.. ఏపీకి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ (Nara Lokesh) ఇప్పటికే వివిధ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయా పర్యటనలు విజయవంతం అయ్యి అనేక కీలక పెట్టుబడులను రాష్ట్రానికి తీసువచ్చారు కూడా. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రేపటి (ఆదివారం) నుంచే ఈ పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌‌లో పాల్గొనాలని లోకేష్‌కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ఫిలిప్‌ గ్రీన్‌ ప్రత్యేక ఆహ్వాన లేఖను పంపిన విషయం తెలిసిందే.
మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మంత్రి లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు ఎస్‌వీపీలో భాగస్వామ్యం కావాలని ఆహ్వాన లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈనెల 24 వరకు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మరోవైపు విశాఖ వేదికగా వచ్చే నెల (నవంబర్) 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో మంత్రి లోకేష్ రోడ్‌ షోలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి
The post Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తుది పోరుకు స‌న్న‌ద్దం భార‌త్ సిద్దం
  • మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు
  • గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్
  • హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
  • హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes