Mohanlal | పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన సంజూ శాంసన్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కీలక సమయంలో బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శిస్తూ టీమిండియాకు విజయాన్ని అందించాడు. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన సంజూ, 97 నాటౌట్‌తో జట్టును గెలిపించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేశాడు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరఫున సంజూ నిలకడగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మధ్యలో వికెట్లు పడినా ఒత్తిడికి లొంగకుండా అద్భుత షాట్లతో స్కోరు బోర్డును నడిపించాడు. చివరి వరకు క్రీజులో ఉండి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
టీ20 ప్రపంచకప్‌లలో ఛేజింగ్ చేస్తున్నప్పుడు భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా సంజూ (97*) రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ ఘనత విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 2022లో పాకిస్థాన్‌పై 82 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత వికెట్‌కీపర్‌గా కూడా సంజూ నిలిచాడు. ఇప్పటివరకు ఆరు హాఫ్ సెంచరీలు సాధించి టాప్‌లో నిలిచాడు. అతని తర్వాత ఇషాన్ కిషన్ (5) ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో సురేష్ రైనా (101) ఉన్నాడు.
అయితే సంజూ అద్భుతమైన ఆటతీరుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా మోహన్ లాల్ ప్రశంసల వర్షం కురిపించారు. సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం చూడటానికి చాలా సంతోషంగా ఉంది.ఇది మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్. ఇది అతనిలోని వ్యక్తిత్వంతో పాటు ప్రతిభని తెలియజేస్తుందని అన్నారు. సంజూ శాంసన్ కష్టసమయంలో జట్టుని అడ్డుకోవడం అద్భుతమని మోహన్ లాల్ కొనియాడారు. ఇక గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
