ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం తెల్లవారుజాము వరకు 24 అడుగులకు చేరింది. దీంతో సమీప కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పొరుగు జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంలలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆ ప్రభావం మున్నేరు పై స్పష్టంగా కనపడింది ఆకేరు మున్నేరు పగిడేరు ల నుంచి భారీగా వరద నీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో అంతకంతకు వరద ఉధృతి పెరుగుకుంటూ వచ్చింది.
దీంతో ఇదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ జలగం నగర్ డిబిఆర్ నగర్ టెంపుల్ సిటీ తదితర కాలనీలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఖమ్మం నగరం వైపు ఉన్న బొక్కల గడ్డ వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ కాలనీ అవకాశాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మరో మూడు అడుగులు పెరిగి 27 నుంచి 28 అడుగులకు మున్నేరు వరద ప్రభావం పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉండగా ఇటీవల నిర్మాణం చేసినా రిటర్నింగ్ వాల్ ముందు వైపున పోలేపల్లి వద్ద వాటర్ డైవర్షన్ కావడంతో పంట పొలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది ఉదయం 10 గంటల వరకు మున్నేరు వాగు వరద వృద్ధికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు
