Nagula Chavithi: అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి. కార్తిక మాసంలో ఈ పండగ జరుపుకోవడం వెనుక ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు ( అక్టోబర్ 25న) కార్తీక శుద్ధ చవితి నాడు పాములను పూజిస్తారు. నాగుల చవితి రోజు నాగులను పూజించడం వలన కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం లాంటివి తొలగిపోతాయని పురాణాల్లో ఉన్నాయి. అయితే, ఈ పండుగ రోజున తమకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లోని పుట్టలో పాలు పోయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం. అనంతరం పుట్టనే సుబ్రహ్మణ్యస్వామిగా భావించి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి వాటిని నైవేద్యాలు భక్తులు సమర్పిస్తారు.
Read Also: Chhath Festival: నేటి నుంచి 4 రోజులు బీహార్‌లో ఛత్ పండుగ.. ప్రత్యేక ఇదే!
పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యమిదే..
అయితే, నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యం ఏంటంటే. మనం విగ్రహానికి నైవేద్యం పెట్టినపుడు దేవుడు ఆ ప్రసాదాన్ని కాక మన భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు. అలాగే, నాగుల చవితి రోజున భక్తులు పుట్టలో పోసే పాలు పాములు తాగకపోయినా నాగ దేవత మన భక్తిని చూసి సంతోషిస్తుంది అని నానుడి. ఆ తర్వాత మనకు సకల శుభాలు కలిగేలా, క్షేమంగా ఉండేలా ఆ నాగమ్మ దీవిస్తుంది అని నమ్మకం. ఇలా ఆ దేవత పట్ల మనం అపారమైన భక్తిని వ్యక్తం చేయడమే పుట్టలో పాలు పోయడం వెనకున్న అసలు రహస్యం.
