Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Nepal | నేపాల్‌లో తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కాల్వ వైపు దూసుకెళ్లిన విమానం..

Ai generated article, credit to orginal website, January 3, 2026

Nepal | నేపాల్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం రన్‌వేను దాటి కాల్వవైపు దూసుకెళ్లింది. అయితే కాస్త దూరం వెళ్లి విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
కాఠ్మాండూ నుంచి భద్రాపూర్‌కు బయల్దేరిన బుద్ధ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానంలో మొత్తం 51 మంది ఉన్నారు. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23 గంటలకు బయల్దేరిన బుద్ధ ఎయిర్‌వేస్ విమానం.. రాత్రి 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన ఈ విమానం.. రన్‌వేను దాటి సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి.. సమీపంలోని కాల్వవైపు వెళ్లి అక్కడ ఆగిపోయింది.గడ్డిలో కూరుకుపోవడం వల్ల విమానం ఆగిందని.. అదే ఇంకాస్త ముందుకు వెళ్లి ఉంటే కాల్వలో పడిపోయి ఉండేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం ATR 72- 500 రకమని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ సురక్షితంగానే ఉన్నారని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. విమానాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
 

Jhapa, Nepal: Buddha Air confirmed that its ATR aircraft operating from Kathmandu veered off the runway while landing at Bhadrapur Airport in Nepal.
All 51 passengers and 4 crew members are safe. The aircraft reportedly stopped about 300 meters east of the runway. pic.twitter.com/ZKxJqrAF9h
— Osint World (@OsiOsint1) January 2, 2026

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి
  • రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు
  • వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి
  • స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్
  • చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes