Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Nitish Kumar Video: వైద్యురాలి హిజాబ్‌ను తొలగించిన నితీష్‌కుమార్.. విపక్షాలు ఆగ్రహం

Ai generated article, credit to orginal website, December 16, 2025

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Mexico Video: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి
అయితే వేదికపైన నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వచ్చింది. నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్‌ను తొలగించాలని కోరారు. కానీ అంతలోనే ఆమె హిజాబ్‌ను కిందకు గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో వైద్యురాలు షాక్‌కు గురైంది. అంతేకాకుండా వేదిక దగ్గర ఉన్న నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోవడం వంతైంది.
ఇది కూడా చదవండి: Trump: శాంతి దిశగా రష్యా-ఉక్రెయిన్‌ అడుగులు.. త్వరలోనే మంచి వార్త వింటారన్న ట్రంప్
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నితీష్ కుమార్ మానసిక పరిస్థితి దయనీయ స్థితికి చేరిందని.. 100 శాతం సంఘీగా మారిపోయారంటూ ఆర్జేడీ విమర్శించింది. అలాగే కాంగ్రెస్ కూడా మండిపడింది. ఇది నీచమైన చర్య అని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. ఈ నీచత్వం క్షమించరానిది అని.. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా 685 మంది ఆయుర్వేద వైద్యులు, 393 మంది హోమియోపతి వైద్యులు, 205 మంది యునాని వైద్య వైద్యులు నియమితులయ్యారు. అందులో పది మందికి నితీష్ కుమార్ నియామక పత్రాలు అందజేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

This is absolutely condemnable and force pulling a woman’s veil down is nothing but public harassment of a woman by the elected CM pic.twitter.com/f5A7vFVY67
— Priyanka Chaturvedi (@priyankac19) December 15, 2025

ये बिहार के मुख्यमंत्री नीतीश कुमार हैं।
इनकी बेशर्मी देखिए- एक महिला डॉक्टर जब अपना नियुक्ति पत्र लेने आई तो नीतीश कुमार ने उनका हिजाब खींच लिया।
बिहार के सबसे बड़े पद पर बैठा हुआ आदमी सरेआम ऐसी नीच हरकत कर रहा है। सोचिए- राज्य में महिलाएं कितनी सुरक्षित होंगी?
नीतीश कुमार… pic.twitter.com/2AO6czZfAA
— Congress (@INCIndia) December 15, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి
  • అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం అనుమానాస్ప‌దం : దీదీ
  • Trolling doesn’t Stop on Raja Saab Team
  • Rajinikanth working on his Autobiography
  • Video : Medaram Sammakka Saralamma Jatara 2026

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes