NTR | ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఫోన్ మాట్లాడుతూ ఓ హోటల్‌కి వెళుతున్న సమయంలో కొందరు అత్యుత్సాహం చూపిస్తూ వీడియో తీసారు. పలుమార్లు ఫొటోలు, వీడియోలు తీయోద్దని చెప్పినప్పటికీ అలానే తీయడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియోని నెట్టింట వైరల్ చేస్తూ ఇతర హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మీ హీరోకి ఎందుకింత కోపం, ప్రతిసారి అభిమానులపై ఇలానే ఫైర్ అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్‌డేట్ బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ సినిమాను పూర్తిగా ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ గట్టిగా నిర్ణయించుకున్నారట. తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌కు కెరీర్‌లో మరిచిపోలేని బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న చిన్న డిటైలింగ్ వరకు కూడా పర్ఫెక్షన్ కావాలనే ఆలోచనతో ప్రతి సీన్‌ను తెరకెక్కిస్తున్నారట.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా దీనిని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తీసుకుంది. ఇటీవల నిర్మాత రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రల మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు, ఎన్టీఆర్‌తో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఈ షెడ్యూల్‌లోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం.హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఎన్టీఆర్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
Instagram lo next mentalodu antunaaru pic.twitter.com/dq2JYeq4eR
— Allu Babloo AADHF (@allubabloo) January 5, 2026
