Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Number Plate Tampering | నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం.. జోయల్ డేవిస్ వార్నింగ్

Ai generated article, credit to orginal website, February 9, 2026

Number Plate Tampering | సిటీబ్యూరో/మలక్‌ పేట్‌ . ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): వాహనాల నెంబర్‌ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్‌కు పాల్పడడం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు. నంబర్‌ ప్లేట్‌ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.
మలక్‌పేటకు చెందిన సయ్యద్‌ అలీవుద్దీన్‌ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నంబర్‌ టీఎస్‌11ఈజెడ్‌2936 ను కావాలనే టీఎస్‌11ఈజెడ్‌2836 మార్చి వాడుతున్నారని, ఈ క్రమంలో అసలైన వాహన యజమాని ఫహీమ్‌అలీ తన వాహనంపై వరుసగా ట్రాఫిక్‌ చలాన్లు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడిందని తెలిపారు.
నిందితుడు చేసిన ఉల్లంఘనల వల్ల అసలు యజమాని వాహనంపై 23 తప్పుడు చలాన్లు నమోదయ్యాయని, నిందితుడిపై చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారని తెలిపారు. నగరంలోని సీసీటీవీ, ఏఎన్‌పీఆర్‌ కెమెరాల ద్వారా ఇటువంటి ట్యాంపరింగ్‌ కేసులను సులభంగా గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తప్పుడు నంబర్‌ ప్లేట్లు వాడటం చట్టరీత్యానేరమని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని జోయల్‌ డేవిస్‌ స్పష్టంచేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు
  • గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
  • 9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి
  • ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes