Donkey Enters Pakistan Parliament Hall: పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఒక అప్రత్యక్ష అతిథి ఆశ్చర్యపరిచింది. సభా కార్యక్రమాలు సవ్యంగా కొనసాగుతుండగా, ఎవరూ ఊహించని విధంగా ఓ గాడిద హాల్‌లోకి చొరబడింది. మొదట్లో అది ఎలా వచ్చిందో అర్థంకాక సభ్యులు ఒక్కసారిగా తికమకపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించినప్పటికీ, గాడిద మాత్రం వారికి గడ్డి పెట్టింది. సభలో పరుగులు పెట్టడం, కొంతమంది ఎంపీలను ఢీకొనడం వంటి హాస్యాస్పద దృశ్యాలు కాసేపు గందరగోళంలా కనిపించాయి. చివరకు పలు ప్రయత్నాల తరువాత సిబ్బంది దాన్ని బయటకు తీసుకెళ్లగలిగారు.
READ MORE: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
ఈ చిన్న ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక దేశ పార్లమెంట్ హాల్‌లోకి జంతువు ఇంత సులభంగా రావడంతో అంతర్జాతీయంగా కూడా భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు మొదలయ్యాయి. నెటిజన్లు దీనిని సరదాగా తీసుకుంటూ కామెంట్లు కురిపించారు. కొందరు గాడిద తన “తోటి వారిని” కలవడానికి వెళ్లిందని రాస్తే, ఇంకొందరు దాని సీటు దొంగిలించారని కోపంగా హాల్‌లోకి దూసుకెళ్లిందని చమత్కరించారు. అనేకమంది ఇది అసలు వీడియోనా లేక ఏఐ జెనరేట్ చేసినదా అనే సందేహం వ్యక్తం చేశారు.
READ MORE: Husband Likes Other Women’s Photos: వేరే మహిళ ఫోటోకు లైక్ కొట్టిన భర్త.. భరణం కోసం కోర్టుకెళ్లిన భార్య
సెనేట్ ఛైర్మన్ యూసఫ్ రజా గిలానీ కూడా ఈ ఘటనపై హాస్యప్రధాన వ్యాఖ్య చేస్తూ.. జంతువులకూ చట్టసభల్లో పాత్ర కల్పించాలని వస్తున్న సందేశమేమో అని అన్నారు. ఆయన వ్యాఖ్య సభలో నవ్వుల పూయించాయి. కాగా అధికారులు మాత్రం ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఏ మార్గం ద్వారా జంతువు లోపలికి చేరిందన్న అంశాన్ని పరిశీలిస్తూ, భద్రతలో ఏ లోపం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నా, ఈసారి వీడియో అంతర్జాతీయ చర్చకు దారితీయడం పాకిస్థాన్ పార్లమెంట్ ప్రతిష్ఠకు సవాలుగా మారింది. కాగా.. వీడియో నిజమా, కృత్రిమ మేధాతో తయారైనదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది!
UNUSUAL:
“Thrilling Breach” by a Donkey in the Pakistani Parliament Hall Sparks Investigation! pic.twitter.com/XaIMdihx2V
— RussiaNews (@mog_russEN) December 5, 2025
