Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Pakistan-Afghan War: “అందితే జుట్టు అందకపోతే కాళ్లు”.. పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం కొత్తేం కాదు..!

Ai generated article, credit to orginal website, October 18, 2025

Pakistan-Afghan War: పాకిస్థాన్‌కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో సైతం అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.
READ MORE: Andrha Pradesh: నేడు ఉద్యోగ సంఘతో ప్రభుత్వం కీలక చర్చలు.. దీపావళి ముందు గుడ్‌న్యూస్‌..!
వాస్తవానికి.. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘన్‌లోని కాబుల్‌పై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ రెచ్చిపోయింది. పాక్‌ సరిహద్దుల వెంట కాల్పులు జరిపి చాలా మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు అక్టోబర్ 15న పాకిస్థాన్ ఫోన్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాగోలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. దొడ్డి దారిన రెచ్చిపోయి దాడులు చేయడం ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది.
READ MORE: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్
కాగా..పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం, రెండు దేశాలు పరస్పరం 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించాయి. అయితే, పాకిస్థాన్ మళ్లీ వంకర బుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు చేసింది. డ్యూరాండ్ లైన్‌కు ఆనుకుని ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లోని అనేక జిల్లాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సైతం మరణించారు. పాకిస్థాన్ దాడిలో తమ ముగ్గురు క్రికెటర్లు మరణించడం పట్ల ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
READ MORE: Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!
ఈ ముగ్గురు క్రికెట్లను కబీర్, సిబ్గతుల్లా, హరూన్ గా చెబుతున్నారు. వీళ్లతో పాటు మరో ఎనిమిది మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం.. ఈ ఆటగాళ్ళు పాక్టికా రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడటానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం ఉర్గున్ జిల్లాలో ఓ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లపై దాడి జరిగింది. ఇది ఆఫ్ఘన్ క్రీడా, క్రికెట్‌కి గణనీయమైన నష్టంగా ACB అభివర్ణించింది. అమరవీరుల కుటుంబాలకు, పాక్టికా ప్రజలకు బోర్డు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ విషాద సంఘటనతో నవంబర్ చివరలో జరగనున్న పాకిస్థాన్‌తో సహా రాబోయే T20 సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. “అల్లాహ్ (SWT) అమరవీరులకు స్వర్గంలో ఉన్నత హోదాను ప్రసాదించుగాక, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు సహనం, బలాన్ని ప్రసాదించుగాక” అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’
  • పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్
  • ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను
  • అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం
  • ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes