Payal Gosh : హీరోయిన్లు ఈ మధ్య బోల్డ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఊహించిన కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినా సరే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఆమె ఎప్పటికప్పుడు క్రికెటర్లపై బోల్డ్ కామెంట్లు చేస్తూ ఉంటుంది.
Read Also : Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
గతంలో ఇర్ఫాన్ పటాన్ తనతో ఐదేళ్ల పాటు డేటింగ్ చేశాడని.. కానీ మధ్యలో మోసం చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిపింది. ఆ బాధతోనే తొమ్మిదేళ్ల పాటు శృంగారానికి దూరంగా ఉన్నట్టు వివరించింది. అతని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా అప్పుడప్పుడు మెసేజ్ లు చేసేవాడని.. కానీ తానురిప్లై ఇవ్వలేదని వివరించింది. మధ్యలో ఓ వ్యక్తి తనతో శృంగారం చేసేందుకు ప్రయత్నించినా.. తాను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. శృంగారం మీద ఉన్న గౌరవంతోనే తాను ఎవరితోనూ అలాంటి తప్పుడు పనులు చేయలేదని చెప్పుకొచ్చింది.
Read Also : Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
