ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఆద్యంతం మోడీ-స్టార్మర్ ఉల్లాసంగా… ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న సుందరమైన రాజ్ భవన్ దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ కలిసి తిరిగారు. పచ్చదనంపై కలిసి నడిచారు. ఒక చోట కొబ్బరిచెట్ల కింద కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఆయా పరిసరాలను కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ.. నవ్వుకుంటూ ఆనందంగా.. ఉల్లాసంగా ముచ్చట్లు చెప్పుకుంటూ సాగిపోయారు.
చాలా సేపు నడుచుకుంటూ సముద్ర దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. పచ్చిక బయళ్లతో కూడిన ప్రశాంతమైన తీర ప్రాంతాన్ని చూస్తూ కనిపించారు. అంతేకాదు అంతకముందు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా స్టార్మర్ ఆస్వాదించారు.
‘‘నా స్నేహితుడు ప్రధాని కీర్ స్టార్మర్‌ను ముంబైలోని రాజ్ భవన్‌లో స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశానికి తొలిసారి రావడం ఖచ్చితంగా ఒక ప్రత్యేక సందర్భం. భారతదేశానికి అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం హాజరు కావడం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. భారతదేశం-యూకే సంబంధాల బలమైన సామర్థ్యాన్ని వివరిస్తుంది.’’ అని మోడీ రాసుకొచ్చారు.
It was a delight to welcome my friend, PM Keir Starmer at the Raj Bhavan in Mumbai. Being his first visit to India, it is surely a special occasion. The presence of the largest business delegation to India makes it even more special and illustrates the strong potential of… pic.twitter.com/znZTxoWq1l
— Narendra Modi (@narendramodi) October 9, 2025
The path-breaking India-UK CETA will create new job opportunities for youth, expand trade and benefit both our industries as well as consumers. In this context, PM Starmer and I discussed trade linkages and economic ties between our nations in the times to come. @Keir_Starmer pic.twitter.com/zs5obf7Hh7
— Narendra Modi (@narendramodi) October 9, 2025
Wonderful rendition of Ed Sheeran & Arijit Singh’s Sapphire, which is a great example of India-UK cultural partnership! pic.twitter.com/aLtx5WyiXT
— Narendra Modi (@narendramodi) October 9, 2025
Glad to have taken part in the Global Fintech Fest 2025 in Mumbai with PM Keir Starmer. Platforms like this highlight our nation’s resolve to strengthen this sector and build new momentum for global welfare.@Keir_Starmer pic.twitter.com/3SjilFkWtw
— Narendra Modi (@narendramodi) October 9, 2025
