Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Pragya Thakur | మీ కూతురు వేరే మతస్తుడితో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి.. లవ్ జిహాద్‌పై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Ai generated article, credit to orginal website, October 21, 2025

Pragya Thakur | మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. లవ్ జిహాద్ పేరుతో మైనారిటీ యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ మీ కూతురు మీ మాట వినకుండా, మతం కాని వ్యక్తుల ఇళ్లలోకి వెళ్లేందుకు, వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకుపోకుండా కాపాడాలని అన్నారు. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటారని వ్యాఖ్యానించారు.
ఇంట్లో కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి, సంబరపడతామని ప్రజ్ఞా సింగ్ తెలిపారు. కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ప్రశ్నించారు. అలా ఇతర మతస్తుడిని కావాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆపడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర మతాల యువకులను తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని తల్లిదండ్రులను ప్రజ్ఞా సింగ్ కోరారు. పిల్లలకు మొదటి నుంచి విలువలను నేర్పించాలని సూచించారు. అయినప్పటికీ వారు మాట వినకపోతే, దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని అన్నారు. అలాంటి అమ్మాయిలకు గుణపాఠం చెప్పడం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.
 

”Break legs of your daughters if she marries a non-Hindu.”
– BJP leader Sadhvi Pragya Thakur
How many of you would agree with Sadhvi Pragya? pic.twitter.com/EI5OuZYWiO
— Rakesh Kishore (@RakeshKishore_l) October 19, 2025

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా తీవ్రంగా ఖండించారు. మత మార్పిడి ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయయని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రజల్లో ఇంత విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్
  • డీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లై
  • రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు
  • క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌
  • సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes