Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్ నుంచి జన్‌సురాజ్ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో అమేఠీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడిపోయినట్లు… ఇప్పుడుఆర్జేడీ కంచుకోటగా భావించే రఘోపూర్ లో తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పరాజయం పాలవుతారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ… ఈ నిర్ణయం పార్టీ చేతుల్లో ఉందన్నారు.
‘‘రాఘోపుర్ లో కుటుంబ ఆధిపత్యానికి తెరదించాలని ఓటర్లు కోరుకుంటున్నారు. తేజస్వీకి ముందు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ… ఈ నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి’’ అని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తేజస్వీ రెండుచోట్ల పోటీ చేయనున్నారనే వాదనలపై స్పందిస్తూ… ‘‘ఆయన్ను అలాగే పోటీ చేయనివ్వండి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో బరిలోకి దిగారు. అమేఠీలో ఓడిపోయారు. తేజస్వీ యాదవ్‌కు ఇప్పుడు రాఘోపుర్‌లో అదే విధమైన ఫలితం వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
Prashant Kishor Shocking Comments
బిహార్ లో వచ్చే నెల 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జన్‌సురాజ్ పార్టీ తరఫున 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఇటీవల విడుదల చేశారు. తాను పోటీ చేస్తానా? లేదా అనే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ఇంకా వెల్లడించలేదు. ‘‘ఆదివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. రాఘోపుర్ నుంచి ఎవరూ పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అది నేనే అవుతానో లేదో చెప్పలేను. ఈ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది’’ అని చెప్పారు.
51 మంది అభ్యర్థుల జాబితా విడుదల
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే 51 మంది అభ్యర్థుల జాబితాను ప్రశాంత్ కిశోర్ విడుదల చేశారు. అందులో ఆయన పేరు చోటుచేసుకోలేదు. తాను పోటీ చేయాలా వద్దా అనే దానిపై పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పీకే చెప్పారు. మొత్తం 243 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నామని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో నవంబర్ 6,11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
Also Read : Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్
The post Prashant Kishor: రాహుల్ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్ కిశోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
