Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Privatization | 12 కీలక రంగాలు ప్రైవేట్‌పరం.. రూ.16.72 లక్షల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం కసరత్తు!

Ai generated article, credit to orginal website, April 8, 2026

Privatization | ప్రభుత్వరంగ నిర్వీర్యమే పరమావధా? ప్రైవేటుకు కొమ్ముకాయడమే కర్తవ్యమా? అందినకాడికి అమ్ముకోవడం లేదా దండుకోవడమే లక్ష్యమా? 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగుతున్నదని, మోదీ పాలనలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికే పెద్దయెత్తున విమర్శలు ఉన్నాయి. వీటికి మరింత ఆజ్యం పోసేలా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. రూ. 16.72 లక్షల కోట్ల నిధుల సమీకరణే (మానిటైజేషన్‌) లక్ష్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన డజను శాఖలను, వ్యవస్థలను ఐదేండ్లపాటు ప్రైవేటుకు ధారాదత్తం చేయడానికి ప్రణాళికలు రచించింది.
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే (మానిటైజేషన్‌) లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పెట్టుబడులను ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశ ఆర్థికానికి కీలకమైన 12 ప్రభుత్వ రంగాలను ఐదేండ్లపాటు ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకొన్నది. తద్వారా రూ.16.72 లక్షల కోట్లను రాబట్టవచ్చని భావిస్తున్నది. ఈ మేరకు ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ 2.0’ పేరిట నీతిఆయోగ్‌ రూపొందించిన కార్యాచరణను కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.

ఏం చేయబోతున్నారు?
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకూ అంటే వచ్చే ఈ ఐదేండ్లపాటు 12 కీలక ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలు, వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. తద్వారా రూ.16.72 లక్షల కోట్లను సమకూర్చుకోవచ్చని అంచనాకు వచ్చింది. ప్రైవేట్‌పరం చేసే ఆస్తులు, వ్యవస్థల జాబితాలో జాతీయ రహదారులు, విద్యుత్తు, పోర్టులు, రైల్వే, బొగ్గు, గనులు, పెట్రోలియం, గ్యాస్‌, విమానయానం, పట్టణాల్లోని ఇన్‌ఫ్రా, వేర్‌హౌజ్‌లు, టెలికం, పర్యాటకం తదితరాలు ఉన్నాయి.
ప్రభుత్వ సంస్థల నిర్వీర్యమే
దేశ ఆర్థిక రంగానికి ఆయువు పట్టుగా పిలిచే 12 ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే కేంద్రం ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ 2.0’ పైప్‌లైన్‌ను తీసుకొచ్చిందని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. మానిటైజేషన్‌లో భాగంగా ఆచరించనున్న కొన్ని పద్ధతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం పేర్కొన్న డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌వోటీ), ఆపరేట్‌, మెయింటెయిన్‌, ట్రాన్స్‌ఫర్‌ (ఓఎంటీ) పద్ధతులు ప్రభుత్వ రంగ వ్యవస్థలను తెగనమ్మడానికి రాచమార్గమని ఆరోపిస్తున్నారు.
డీబీఎఫ్‌వోటీ, ఓఎంటీ పద్ధతుల్లో ఒప్పందం జరిగితే, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వ రంగ ఆస్తులు.. ప్రైవేట్‌రంగ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని, అలాంటప్పుడు ఐదేండ్ల వ్యవధి అనే నిబంధన గాలికొదిలేసినట్టేనని గుర్తు చేస్తున్నారు. లీజు పేరిట ఐదేండ్లపాటు ప్రభుత్వ ఆస్తులను.. ప్రైవేటుకు ఇవ్వడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని మోదీ కి పలువురు హితవు పలుకుతున్నారు.
ఏ ఏడాది.. ఎంత మానిటైజేషన్‌?

ఏ రంగంలో ఎంత ప్రైవేటైజేషన్‌?

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్
  • సీనియ‌ర్ సిటిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
  • టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు
  • గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం
  • సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes