Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌

Ai generated article, credit to orginal website, October 23, 2025

 
 
 
పంజాబ్ మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భార్యతో… తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
పంజాబ్‌ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్‌ ముస్తాఫా తనయుడు అకీల్‌ అక్తర్‌(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకులలోని తన నివాసంలో అక్టోబర్‌ 16వ తేదీన అకీల్‌ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. అయితే పొరుగింట్లో షామ్‌షుద్దీన్‌ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు.
 
ఈ కేసు దర్యాప్తులో ఉండగానే… తాజాగా ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్‌ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని… దీనితో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్‌ చెప్పుకొచ్చాడు.
 
ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్‌ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
The post Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • చెల‌రేగిన సంజూ శాంస‌న్ ఇండియా భారీ స్కోర్
  • ప్రకృతి వైపరీత్యాల్లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాం
  • అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
  • పీపీపీ మోడ‌ల్ లో ఓడ‌రేవుల నిర్వ‌హ‌ణ : జ‌నార్ద‌న్ రెడ్డి
  • తెలంగాణ‌కు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes