Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇది కులం పేరుతో మానవత్వాన్ని నలిపేస్తున్న ‘తీవ్రమవుతున్న సామాజిక విషానికి’ చిహ్నంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ వేదికగా వరస ట్వీట్లలో సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Cough syrup: దగ్గుమందు మరణాలు.. తమిళనాడు సహకరించడం లేదన్న మధ్యప్రదేశ్ సీఎం..
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కులం ఆధారంగా వివక్షకు గురైతే, సాధారణ దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాయ్‌బరేలిలో హరియోమ్ వాల్మీకి హత్య,భారత ప్రధాన న్యాయమూర్తిపై షూ దాడిని ఆయన ప్రస్తావించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ద్వేషాన్ని, మనువాద మనస్తత్వాన్ని వ్యాప్తి చేస్తోందని గాంధీ ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, ఇతర వెనకబడిన తరగతులు, ముస్లింలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది ఒక్క పురాణ్ కుమార్ పోరాటం మాత్రమే కాదని, ఇది రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై నమ్మకం ఉన్న ప్రతీ భారతీయుడి పోరాటం అని ట్వీట్ చేశారు.
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్, సర్వీసులో కుల వివక్ష, వేధింపులకు గురైనట్లు సమాచారం. ఆయన మరణం కుల ఆధారిత పక్షపాతం, పరిపాలనా వేధింపులు కారణమని తెలుస్తోంది.
हरियाणा के IPS अधिकारी वाई पूरन कुमार जी की आत्महत्या उस गहराते सामाजिक ज़हर का प्रतीक है, जो जाति के नाम पर इंसानियत को कुचल रहा है।
जब एक IPS अधिकारी को उसकी जाति के कारण अपमान और अत्याचार सहने पड़ें – तो सोचिए, आम दलित नागरिक किन हालात में जी रहा होगा।
रायबरेली में हरिओम…
— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2025
