ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా,కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకమైన రోల్ లో కనిపించబోతున్నారు. టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Also Read : Bandla Ganesh : మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్.. ఆ హీరోనుద్దేశించేనా?
ఇటివల షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ రిలీజ్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెల 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా. కాగా ఈ సినిమాను ఈ సారి ఫ్యాన్స్ తో కలిసి చూడాలని భావిస్తున్నాడు పోతినేని. అనుకున్నదే తడవుగా అందుకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేసారు మేకర్స్.ఫ్యాన్స్ తో కలిసి రామ్ ఈ సీనియాను USAలో చూడబోతున్నాడు. అందుకోసం రెండు రోజుల ముందుగానే అంటే ఈ నెల 26న ఎర్లీ ప్రీమియర్స్ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన లభించింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన నువ్వుంటే చాలే సాంగ్ ను రామ్ స్వయంగా రాసాడు. అలాగే తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు మనసును హత్తుకునే కథాంశంతో యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ పోతినేని సాలిడ్ కంబ్యాక్ గ్యారెంటీ అనిపిస్తోంది.
