Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Retirement Benefits | రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాక అనారోగ్యం.. రెండేండ్లు అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఓయూ ప్రొఫెసర్‌

Ai generated article, credit to orginal website, February 17, 2026

Retirement Benefits | ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 16: ఉద్యోగ విరమణ చేసి రెండేండ్లయినా ఇప్పటికీ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్సారీ తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరారు. రిటైర్‌ అయినప్పటి నుంచి తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఓయూ అధికారులతో ఆయన పోరాటం చేస్తున్నారు. తనకు పెన్షన్‌, ఇతర ప్రయోజనాలు అందించకపోవడంతో రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించారు.
దీనిపై ఆయనకు తక్షణమే ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ ప్రకారం పెన్షన్‌ చెల్లించాలని ఆదేశించినా, వర్సిటీ అధికారులు జాప్యం చేయడంతో ఆయన పలుమార్లు ఆందోళన సైతం చేపట్టారు. తన సమస్యను చెప్పుకొనేందుకు పరిపాలనా భవనానికి  వస్తుంటే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతాసిబ్బంది గేటు దగ్గరే ఆయనను అడ్డుకుంటున్నారు. దీంతో ఆయన ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తంచేశారు. ఇది వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశమై అన్ని సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. సుదీర్ఘకాలం ప్రొఫెసర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని పరిపాలనా భవనంలోకి అనుమతించకపోవడంపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు.
గత వీసీ, రిజిస్ట్రార్‌, ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్‌లు ఉద్దేశపూర్వకంగానే ఆయనకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్ర మానసిక ఒత్తడికి గురవడం వల్లనే ఆయన పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారని చెప్తున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను మెహిదీపట్నంలోని మైత్రి దవాఖానలో చేర్పించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
  • ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్
  • దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
  • పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట
  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes