Revanth Reddy | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పెండ్లి వేడుకకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారని తెలిసింది. కాగా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 66వ సారి.
సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షంతోపాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న కూడా సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పాల్సి సీఎం సభకు చాలా ఆలస్యంగా వచ్చారు. సీఎం రాక కోసం ఎమ్మెల్యేలంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఓవైపు అసెంబ్లీలో కీలక ప్ర సంగం ఉన్న సమయంలో సీఎం ఢిల్లీ వెళ్లడం, అక్కడే ఒక రోజు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
