Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Road Accident | ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం

Ai generated article, credit to orginal website, November 16, 2025

రఘునాథపల్లి నవంబర్ 16 : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిడిగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై టీఎస్ 07 యుకె 5 4 6 9 నెంబర్ గల ఇసుక లారీ పార్క్ చేసి ఉంది. ఇదే క్రమంలో టీఎస్ 0 3 Z0046 నెంబర్ గల ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ హన్మకొండ నుండి హైదరాబాద్ వెళుతుంది. నిడిగొండ బ్రిడ్జి సమీపానికి రాగానే ఆగిన లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్ద చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ తెలిపారు.

 

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా
  • జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్
  • టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత
  • చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్
  • అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes