Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

Ai generated article, credit to orginal website, November 24, 2025

 
 
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. మలికప్పురం ఆలయం వెనుక ఉన్న ఈ సత్రంలో రోజు 10 వేలమందికిపైగా భక్తులకు మూడు పూటలా ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. ఇటీవల మండల- మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర ప్రారంభం కాగా.. ఇక్కడ భోజనం చేసినవారి సంఖ్య శనివారం నాటికి లక్ష దాటింది.
శబరిమలలోని అన్నదాన సత్రం ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన మండపాల్లో ఒకటి. ఒకేసారి వెయ్యిమందికిపైగా భక్తులకు వడ్డించే ఏర్పాట్లు ఉన్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 వరకు, సాయంత్రం 6.45 నుంచి ఆ రోజు ఆలయం మూసివేసే వరకు మూడు పూటలా ఆహారం అందజేస్తారు. వంటలు చేయడం, వడ్డించడం, క్లీనింగ్‌ కోసం 235 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు.
The post Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం
  • న‌కిలీ క‌రెన్సీ నోట్ల కేసులో ఏడుగురికి జైలు శిక్ష
  • స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం
  • వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం
  • అల్లుడు అక్రమ మైనింగ్ మంత్రి రియల్ ఎస్టేట్ దందా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes